బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

May 1, 2026 - 21:57
 0  2
బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

 తిరుమలగిరి 02 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ధాన్యం కొనుగోళ్ల కేంద్రలల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పౌర సరఫరా సంస్థ అధికారి కి మరియు మార్కెటింగ్ DM కి యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ వినతిపత్రం సమర్పించడం జరిగింది....తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి ఐకేపీకి తరలించిన సామ ఆంజనేయులు మరియు వారి అనుచరులపై చర్యలు తీసుకొని మార్కెట్ కమిషన్ ను వారి లైసెన్స్ ను రద్దు చెయ్యాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వడ్ల కొనుగోలు కేంద్రం లను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వడ్ల కు మద్దతు ధరను ఇచ్చి 500 రూపాయల బోనసులను ఇస్తూ రైతు లను రాజులను చెయ్యాలని చూస్తుంటే ఈ దళారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని వెంటనే వారిని అరెస్టుచేసి నాన్ బెయిలబుల్ చట్టాన్నీ ఉపయోగించాలని రైతుల పక్షాన నిలబడాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సూర్యాపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజబోయిన శ్రీకాంత్,NSUI సూర్యాపేట టౌన్ అధ్యక్షులు చింత నవీన్, గోపాలదాస్ సోమేష్ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి