ఘనంగా మేడే ఉత్సవాలు
తిరుమలగిరి 02 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :
తిరుమలగిరి చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లంల యాదగిరి పాల్గొని మాట్లాడారు. కార్మికులు 18 గంటల పని దినాలకు వ్యతిరేకంగా చికాగో నగరంలో జరిగిన గొప్ప తిరుగుబాటు ఫలితమే ఈ మేడే దినోత్సవం. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదంతో కార్మికులలో మార్పు మొదలైంది. అలాగే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను 44 కార్మిక చట్టాలు అతి ముఖ్యమైన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వ్యాపార వర్గాలైన పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడులు తెచ్చింది. ఈ కోడల వల్ల కార్మికుల పని గంటలను 8 గంటలు పనిచేయించుకొని యజమాన్యం శ్రమ దోపిడీ చేస్తున్నారు. అంతేకాకుండా రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎస్ డి ఫయాజ్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తిపిరాల శ్రీకాంత్, మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు కందుకూరి ప్రవీణ్, చేను శ్రీనివాస్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జంపాల మల్లయ్య, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ ఇస్లావత్ మనోజ్ కుమార్, మండల సహాయ కార్యదర్శి షర్టు నరసయ్య, టౌన్ కార్యదర్శి రావుల పురుషోత్తం,సుంచు సత్తయ్య, కుదురుపాక ఉపుల్లయ్య, ముత్యాల యాకన్న కనుక అశోక్ తదితరులు పాల్గొన్నారు.