ఎర్రవల్లి మండలానికి 98 శాతం టెక్స్ట్ బుక్స్ చేరిక
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులక అవసరమైన టెక్స్ట్ బుక్స్‌లో 98 శాతం పుస్తకాలు మండలానికి చేరుకున్నాయని మండల విద్యాశాఖ అధికారి శ్రీ.J అమీర్ పాష తెలిపారు.
మొదటి విడతలో భాగంగా PART -01 మొత్తం 12,903 టెక్స్ట్ బుక్స్ మండల విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నాయని, వాటిని నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (PS), ప్రాథమికోన్నత పాఠశాలలు (UPS), ఉన్నత పాఠశాలలు (ZPHS) మరియు కేజీబీవీ పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 10వ తేదీ నుండి పంపిణీ కార్యక్రమం ప్రారంభమై అన్ని పాఠశాలలకు పుస్తకాల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఖాజా, సీఆర్పీలు శ్రీనివాసులు, రాణి తదితరులు పాల్గొని పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంఈఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.