ఎంజీ రోడ్ లో శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం డాక్టర్ సాయి సిద్దు
సూర్యాపేట, 16 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని డాక్టర్ సాయి సిద్ధు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎంజీ రోడ్ల్ నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి మాట్లాడారు. తక్కు ఖర్చుతో అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రమల్ల రాములు, ఎర్ర వీరస్వామి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.