సూర్యాపేట పోలీస్ వారాంతపు కవాతు, పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

Jul 18, 2026 - 11:20
 0  0
సూర్యాపేట పోలీస్ వారాంతపు కవాతు, పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్
సూర్యాపేట పోలీస్ వారాంతపు కవాతు, పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్
సూర్యాపేట పోలీస్ వారాంతపు కవాతు, పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్
సూర్యాపేట పోలీస్ వారాంతపు కవాతు, పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

 పోలీసులు బాధితులకు అండగా ఉండాలి.
- శాంతిభద్రతల రక్షణ, ప్రజల భద్రతలో పటిష్టంగా పని చేయాలి.
- నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
... సూర్యాపేట జిల్లా ఎస్పి.

సూర్యాపేట: పోలీస్ సిబ్బందిలో పరస్పర సమన్వయం, సమయపాలన, శారీరక దారుఢ్యం (ఫిట్నెస్) పెంపొందించడం కోసమే ప్రతి శనివారం వారాంతపు పోలీసు పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కవాతు నందు ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల, సూర్యాపేట పట్టణ పీస్ సిబ్బంది, సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న పీస్ ల సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రత, రక్షణలో పటిష్టంగా పని చేయాలి, బాధితులకు అండగా ఉండాలని అన్నారు. నేరాలకు పాల్పడే వారిపట్ల, ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.

విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగతంగా గానీ సిబ్బందికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఎస్పీ గారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఒత్తిడితో కూడిన విధుల్లో శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహ చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, నారాయణ రాజు, సిఐ లు వెంకటయ్య, రాజశేఖర్, ఆర్ఎస్ఐలు, ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333