సూర్యాపేట లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం నాడు సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా నియమించబడిన వెలుగు వెంకన్న మరియు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులకు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి గత మూడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చాయని, మండలాల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే సూర్యాపేటలో ఓట్లు తక్కువగా వస్తున్నాయని, కాబట్టి ఈసారి సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో అత్యధికంగా ఓట్లు పడేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటినుంచే వ్యూహరచన చేయాలని అన్నారు. సీనియర్ నాయకులు, కౌన్సిలర్ వెలుగు వెంకన్నకు పట్టణ అధ్యక్షుడు పదవి రావడం కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తుందని ఆయన నాయకత్వంలో సూర్యాపేటలో బ్రహ్మాండమైన మెజార్టీ సాధించాలని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో కూడా కమిటీలు వేయాలని పట్టణ అధ్యక్షులుకు సూచించారు. వెలుగు వెంకన్న వివాదరహితుడని, అంకితభావంతో పనిచేసే నాయకుడని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేటలో నాయకులు కలిసిమెలిసి పనిచేయడం వలన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, పార్టి లో వర్గపోరు వల్లనే ఎమ్మెల్యేగా జగదీశ్ రెడ్డి గెలవడం జరిగిందని అంతేతప్ప బిఆర్ఎస్ పార్టీకి బలం లేదని అన్నారు. ఈసారి నాయకులందరూ ఏకమై ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా గట్టిగా ప్రయత్నం చేయాలని సూర్యాపేటను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు వెలుగు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రమణారెడ్డి, నేరెళ్ళ మధు, బెల్లంకొండ శ్రీరాములు, బంటు చొక్కయ్య లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్ లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, ఫారూక్, పాలగాని కృష్ణ, నాయకులు నిమ్మల వెంకన్న, దొంతిరెడ్డి సైదిరెడ్డి, వల్దాసు దేవేందర్, ధర్మా నాయక్ , రంగారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.