ఈనెల 28న హైదరాబాద్ లో జరిగే న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయండి.

Dec 25, 2024 - 18:54
Dec 25, 2024 - 19:18
 0  9
ఈనెల 28న హైదరాబాద్ లో జరిగే న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయండి.

ఈనెల 28న హైదరాబాద్ లో జరిగే న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయండి.

చర్ల డిసెంబర్ 25 తెలంగాణ వార్త:-  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను ఈనెల 28న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు దీనికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చర్ల మండలం కేంద్రంలో ఉన్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.ప్రపంచంలో ప్రజలంతా ఎర్రజెండా వైపే చూస్తున్నారని అందులో భాగంగానే ఎర్రజెండాలన్నీ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ క్రమంలోనే భారత దేశంలోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అనేక విప్లవ పార్టీలతో చర్చలు జరిపి ఈ నెల 28న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనం కాబోతున్నాయని ఆయన అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఎంతోమంది పేద ప్రజలకు ఆదివాసి గిరిజనులకు భూమిలేని పేదలకు పోడుభూమి కొట్టించిందని వేలాదిమంది తమ అమూల్యమైన ప్రాణాలను ప్రజల కోసం రక్త తరఫున చేశారని ఆయన అన్నారు. పేద ప్రజలకు అండైన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ వైపు అందరూ ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీతోటే నూతన ప్రజాసామిక విప్లవం సాధ్యమని భావిస్తున్నాం కావున ఈ సదస్సుకు మేధావులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరుతున్న ఈ కార్యక్రమంలో స్వరూప్ లావణ్య లక్ష్మి సరిత స్వప్న హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్