ఈనెల 14 నుండి 16వరకు శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలు.

May 6, 2024 - 19:56
 0  38
ఈనెల 14 నుండి 16వరకు శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలు.

జోగులాంబ గద్వాల 6 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ప్రముఖ కర్ణాటక వాగ్గేయకారులు అర్జున అంశసంభోధులు అయిన శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలు ఈనెల 14 నుండి 15 వరకు జరుగుతాయని శ్రీ శేష దాసుల వంశస్తులైన ధీరేంద్ర దాస్ తెలిపారు. సోమవారం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధీరేంద్ర దాస్ మాట్లాడుతూ ఈనెల 14న దాసుల వారి చిత్రపటంతో గ్రామ ప్రదక్షణ, ధన్వంతరి హోమం 15న రథోత్సవం పవమాన హోమం, 16 సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటాయని తెలిపారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ ఆచారి, రాఘవేంద్ర దాస్ విష్ణు, శశాంక, చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333