ఇంద్రకీలాద్రిపై కిక్కిరిసిన భవానీలు
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- ఇంద్రకీలాద్రిపై కిక్కిరిసిన భవానీలు AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భారీగా రద్దీ నెలకొంది. దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని క్యూలైన్లలోనూ ఉచితంగానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలో ప్రవేశించిన వారికి దర్శనం పూర్తయ్యేసరికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తోంది. ఇవాళ పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పరిసమాప్తం కానుంది.