ఇంటర్ ఫలితాలలో ప్రథమ స్థానం సాధించిన మోడల్ స్కూల్

Apr 24, 2024 - 20:46
 0  723
ఇంటర్ ఫలితాలలో ప్రథమ స్థానం సాధించిన మోడల్ స్కూల్

తిరుమలగిరి 25 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని ప్రిన్సిపల్ వేముల బాలరాజు  తెలిపారు. బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ లో చల్లా కళ్యాణి 1000 మార్కులకు 969 మార్కులు, బైపీసీలో కుటికంటి సౌమ్య 1000 మార్కులకు 856 , సీఇసి లో సున్నపోజు నిహారిక 1000 మార్కులకు 771 మార్కులు సాధించగా.. ప్రథమ సంవత్సరంలో ఏలూరి రోహిత్ ఎంపీసీలో 470 కి 448 మార్కులు ,బైపిసి లో మందుల రేష్మ 440 మార్కులకు417 మార్కులు, సీఇసీలో బెల్లి అంజలి 343 మార్కులు సాధించారు. ఈ ఫలితాల్లో ప్రథమ స్థానంలో మార్కులు పొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ వేముల బాలరాజు మరియు ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034