ఆర్.ఎం.పి పిఎంపీలకు బతుకు భరోసా కల్పించాలి

Aug 14, 2024 - 09:38
 0  74
ఆర్.ఎం.పి పిఎంపీలకు బతుకు భరోసా కల్పించాలి

ఆర్ఎంపీ పీఎంపీలకు బతుకు భరోసా కల్పించాలి

తెలంగాణ వార్తా సూర్యాపేట జిల్లా ప్రతినిధి

కార్పొరేట్ హాస్పిటల్ లో క్యాష్ లెస్ వైద్య సౌకర్యం కల్పించాలి

20 ఏళ్ల అనుభవం ఉన్నవారికి సర్టిఫికెట్స్ అందజేయాలి 

*-ఆర్ఎంపీ పీఎంపీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న

*సూర్యాపేట* : ఏ రకమైన గుర్తింపు లేకుండా బతుకుతున్న గ్రామీణ వైద్యులకు బతుకు భరోసా కల్పించాలని తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జీవివి ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం బతుకు భరోసా సూర్యాపేట జిల్లా 12వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.గత 60 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ, మురికివాడలలో అనుభవ పూర్వకంగానే తాము ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.గ్రామీణ వైద్యులకు కార్పొరేట్ హాస్పటల్ లో రూ.10 లక్షల క్యాష్ లెస్ వైద్య సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. 20 ఏళ్ల అనుభవం ఉన్న ఆర్ఎంపీలకు సర్టిఫికెట్స్ ఇచ్చి భరోసా కల్పించాలన్నారు. గ్రామీణ వైద్యులపై ఎన్ఎంసీ, ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖల దాడులను నిరవధికంగా నిరోధించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి స్థాయికి మించిన వైద్యం చేసేవారికి తమ సంఘం సహకరించదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాము రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే అందిస్తామని తెలిపారు. దశాబ్ద కాలంగా గుర్తింపు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు, సర్టిఫికెట్లు జారీ చేయుటకు అధ్యయనం చేయాలని ప్రసార మాధ్యమాల ద్వారా అధికారులను ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పసునూరి సత్యనారాయణ, కోశాధికారి ఎండి గఫార్,ఖమ్మం జిల్లా అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుప్పాల లక్ష్మీనరసయ్య, సూర్యాపేట జిల్లా సహా అధ్యక్షులు షేక్. రహమతుల్లా, ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి రాజేందర్,కోశాధికారి జేరిపోతుల లక్ష్మణ్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ డాంగే గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గూకంటి రాజబాబు రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పుప్పాల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223