అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలను ఉధృతం చేద్దాం.
తెలంగాణ వార్త 05.11.2024.సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- ఈ నెల 9న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయండి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ భూమి,భుక్తి ,పేద ప్రజల విముక్తి కోసం పోరాడుతూ భారత విప్లవోద్యమంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించుకోవాలని, అదే విధంగా ఈ నెల 9న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ దగ్గర జరిగే అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న పిలుపునిచ్చారు. *సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్1 నుండి 9వరకు భారత విప్లవోద్యమ వీరుల స్మారక వారోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్లో పట్టణ నాయకులు జక్కుల శేషగిరి ఎర్రజెండాను ఎగురవేసి అమరవీరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న లు పాల్గొని మాట్లాడుతూ* దేశంలో గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ సామ్రాజ్యవాద పెట్టుబడిదారి కంపెనీలకు కట్టబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాలకులు దేశంలో 78 సంవత్సరాల పార్లమెంటరీ పాలనలో పేదలకు ఉచిత విద్య, వైద్యం,భద్రతతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో మరియు పేదరికం, నిరుద్యోగం, కుల,మత ఆర్థిక అసమానతలు రూపుమాపడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.దేశంలో ప్రజల సంక్షేమాన్ని, ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా దేశాన్ని మతోన్మాద ఫాసిజం వైపు తీసుకెళ్తు, దేశ లౌకిక వ్యవస్థ విచ్చన్నానికి పాల్పడుతున్నారు తీవ్రంగా ఆక్షేపించారు.రాష్ట్రంలో 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు.పాలకవర్గ పార్టీలన్ని ఒకేతానుగుడ్డలన్న విషయాన్ని మర్చిపోకూడదని, ప్రభుత్వాలు మారిన ప్రజల వెతలు, తలరాతలు మాత్రం మారటం లేదని, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేది కమ్యూనిస్టు విప్లవకారులేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు.ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన విప్లవకారులను స్పూర్తిగా తీసుకొని కులం,మతం,దోపిడీ,పీడన, అణచివేత లేని సమ సమాజ స్థాపన కోసం జరిగే నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటాల్లో ప్రజలంతా క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.నవంబర్ 9న జిల్లా కేంద్రంలో జరిగే అమరవీరుల సంస్మరణ సభలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు సయ్యద్,భూక్యా రాంజీ, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహయ కార్యదర్శి సంతోషి మాత,కోశాధికారి జయమ్మ, మేరమ్మ, సరస్వతి, మాలతి, యాకమ్మ, రాణమ్మ, ప్రదీప్, కమల,శ్రీరామ్,చిట్టి తదితరులు పాల్గొన్నారు.