అట్టహాసంగా ముగిసిన ములుగు ప్రీమియర్ లీగ్

Aug 29, 2026 - 21:44
Aug 29, 2026 - 21:47
 0  22
అట్టహాసంగా ముగిసిన ములుగు ప్రీమియర్ లీగ్

ఫైనల్స్‌లో 4 వికెట్ల తేడాతో విజేతగా నిలిచిన గట్టమ్మ వారియర్స్

క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే లక్ష్యం

ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ హెడ్ కుంజ సూర్య

ములుగు జిల్లా, ఆగస్టు 29:- టీమ్ సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అచ్చం ఐపీఎల్ తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ములుగు ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ పండుగ వాతావరణంలో ఘనంగా ముగిసింది. సుమారు 30 రోజుల పాటు సాగిన ఈ క్రికెట్ సంగ్రామంలో మొత్తం 8 జట్లు గట్టమ్మ వారియర్స్ మల్లూరు హేమాచల హైడ్రాస్ మేడారం మావెరిక్స్ రామప్ప రాయల్స్ బొగత బ్లాస్టర్స్ లక్నవరం లెజెండ్స్ ఏటూరునాగారం ఎంపరర్స్ కన్నాయిగూడెం కింగ్స్ తలపడ్డాయి. (హెచ్.సి.ఏ) అధికారిక అంపైరింగ్ ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమింగ్ ఉత్సాహపరిచే కామెంటరీ మ్యూజిక్ తదితర ఆకర్షణలతో 32 మ్యాచ్‌ల పాటు ఈ టోర్నీ క్రీడాభిమానులను విశేషంగా అలరించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మల్లూరు హేమాచల హైడ్రాస్ జట్టుపై 4 వికెట్ల తేడాతో గట్టమ్మ వారియర్స్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. క్రీడాకారులకు స్ఫూర్తిగా కుంజ సూర్య అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ హెడ్ శ్రీ కుంజ సూర్య విజేతలకు ట్రోఫీలను అందజేశారు. జిల్లాలో మెరుగైన క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాకు చెందిన యువ ఆటగాళ్లు భవిష్యత్తులో టీజీటీ 20, రంజీ ట్రోఫీ ఐపీఎల్ (ఐపీల్ )తో పాటు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే తన ప్రధాన ఆకాంక్ష అని ఆ దిశగా క్రీడాకారులను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాదం ప్రవీణ్ మున్సిపల్ కౌన్సిలర్ నల్లెల భరత్ ములుగు జిల్లా యూత్ ప్రెసిడెంట్ మారం సుమన్ మండల యూత్ ప్రెసిడెంట్ బండి మధు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333