ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు...
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి..
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్రింది నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు
డ్రైవింగ్ లైసెన్స్
ఆటో నడిపే ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన పత్రాలను కలిగి ఉండాలి.
మద్యం సేవించి వాహనం నడపరాదు. మద్యం మత్తులో ఆటోలు నడపడం వల్ల అమాయక ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్ నియమాలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, సిగ్నల్ జంపింగ్ చేయవద్దని స్పష్టం చేశారు.
పరిమితికి మించి ప్రయాణికులు
ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.