TET నోటిఫికేషన్ విడుదల చేయాలి.
డాక్టర్ ప్రేమ్ కుమార్.
జోగులాంబ గద్వాల 5 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. తెలంగాణ ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ప్రొఫెసర్ కోదండరాం కి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ ,టెట్ నోటిఫికేషన్ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులు నష్టపోతారు. టెట్ రాయనివారు, టెట్ అర్హత సాధించని వారు వేలాది మంది నిరుద్యోగులు టిటిసి మరియు బిఈడి చేసి అర్హత పొందని వారు టెట్ రాయని వారు ఉన్నారని వారిని దృష్టిలో ఉంచుకొని వారికి న్యాయం జరిగేలా టెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రొఫెసర్ కోదండరాం ని కలిసి వినతిపత్రం సమర్పించారు.