Acupuncture Therapy Center క్లినిక్ ని ఆకస్మిక తనిఖీ
జోగులాంబ గద్వాల 1 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. తేదీ 01.07.2024 న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. శశికళ , మరియు ఉప - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ ఎస్. కె . సిద్ధప్ప ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కె. మధుసూదన్ రెడ్డి ,I/C Dy.DEMO మరియు నరసయ్య హెల్త్ అసిస్టెంట్, భీమ్ నగర్ గద్వాల లో షేక్ భాషా నిర్వహిస్తున్న Acupuncture Therapy Center క్లినిక్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు... ఈ షేక్ బాషా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ నుండి గద్వాలకు వచ్చి బీమ్ నగర్ లో అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నాడు.. ఈ క్లినిక్ నందు అన్ని రకాల వ్యాధులకు Acupuncture Therapy ద్వారా చికిత్స నిర్వహిస్తున్నాడు... ఈ Acupuncture Therapy Center , క్లినిక్ , తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 మరియు రూల్స్ -2011 ప్రకారము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి జిల్లా అధికారులు షేక్ బాషాని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రకారము , క్లినిక్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. లేనిచో ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు చట్టరీత్యా తీసుకుంటామని తెలిపారు... అదేవిధంగా బిల్డింగ్ యజమాని కి కూడా అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహించుటకు పర్మిషన్ ఇవ్వరాదని ఇచ్చినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు...