5 వ వార్డు అభివృద్ధి నా ధ్యేయం :శివరాత్రి వెంకన్న

Feb 8, 2026 - 05:03
 0  5
5 వ వార్డు అభివృద్ధి నా ధ్యేయం :శివరాత్రి వెంకన్న

​ తిరుమలగిరి 08 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్-

​తిరుమలగిరి మున్సిపాలిటీలోని 5వ వార్డ్ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా, నిరంతరం ప్రజల చెంత ఉంటూ సమస్యలపై గళమెత్తే శివరాత్రి వెంకన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.  ఆయనే ఐదో వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తూ తన మీద నమ్మకం ఉంచి మొదటిసారి అవకాశం ఇవ్వమని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయం అంటే అధికారం కాదు, అంకితభావంతో కూడిన సేవ అని ఆయన అన్నారు,మెరుగైన మౌలిక వసతులు వార్డులో నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని, వీధి దీపాల ఏర్పాటు మరియు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక షార్ధ వహిస్తానన్నారు,సమస్య వచ్చినా పిలవగానే పలికే కార్యకర్తగా మీ మధ్యే ఉంటానని అన్నారు, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానన్నారు, ఓటరు దేవుళ్లకు పార్టీల కంటే వార్డు ప్రయోజనాలే ముఖ్యం. మీ అమూల్యమైన ఓటును 'బ్యాట్' గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి శివరాత్రి వెంకన్న కోరారు. ఈ కార్యక్రమంలో కుదురుపాక రాములు శ్రీలత, చింతకాయల యాకస్వామి, కోటబత్తుల సతీష్, బండి సోమన్న, నారబోయిన రాములు, చింతకాయల సత్తయ్య, శివరాత్రి ఎల్లయ్య, వీరమల్ల రాము, శివరాత్రి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి