40 సంవత్సరాల నుండి ఎదురుచూసి ఎదురుచూసి ప్రాణాలు వదిలిన శ్రీశైలం నిర్వహితుడు

30-05-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం: పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో శ్రీశైలం నిర్వాసితుడు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉద్యోగం కోసం ఎదురుచూసి, ఎదురుచూసి ప్రాణాలు వదిలాడు. అసువులు బాసిన శ్రీశైలం నిర్వాసితుడు. పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం గ్రామానికి చెందిన సురగౌని రాఘవేందర్ గౌడ్ (45) శ్రీశైలం ప్రాజెక్టు నీటింపు నిర్వాసితుడు. ఉద్యోగం కోసం తిరగని రాజకీయ నాయకులు, కలవని ప్రభుత్వ అధికారి లేడు. ఇలా తిరుగుతూనే ఆరోగ్యం చెడిపోయి నిర్వాసిత నిరుద్యోగ ఫలం అందకుండానే అసువులు బాసిన సంఘటన చోటుచేసుకుంది.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు గత 40 సంవత్సరాల నుండి ఆయా ప్రభుత్వాల చుట్టూ, అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ, తిరిగి విసిగి వేసారి పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్న నిరుద్యోగ నిర్వాసితులు తీవ్రమైనటువంటి నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా రాజకీయ నాయకులకు విషయం తెలిసినప్పటికీ ఒక్కరూ కూడా నివాళులు అర్పించకపోవడం సిగ్గుచేటు
అదే రాజకీయ నాయకులకు ఇదే సంఘటన జరిగితే బారులు తీరి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చేవారు. రాజకీయ నాయకులారా మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాకు సమయం రానే వచ్చింది మీ మెడలు వంచైనా సరే మేము ఉద్యోగాలు సాధిస్తాం అని నిరుద్యోగులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
విషయం తెలిసిన ఉమ్మడి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల నాయకులు డాగోజీరావు ఆధ్వర్యంలో చనిపోయిన రాఘవేంద్ర కుటుంబాన్ని శ్రీశైలం నిర్వాసితుల సంఘ సభ్యులు పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో 98 ప్రకారం ఉద్యోగాలు పొందే వరకు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాటం కొన సాగిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డాగోజీరావుతోపాటు, గోవిందు, పురుషోత్తం, శ్రీనివాస్ గౌడ్ , రామన్ గౌడ్, జల్లి సుధాకర్ ,మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.