17 న సూర్యాపేటలో హాస్పిటల్స్ బంద్

Aug 16, 2024 - 21:52
Aug 16, 2024 - 21:56
 0  11
17 న సూర్యాపేటలో హాస్పిటల్స్ బంద్

సూర్యాపేట 16 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతో 24గంటలపాటు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ డాంగే, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్ రమేష్ లు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. కలకత్తాలో మహిళా డాక్టర్ దారుణ హత్యను నిరసిస్తూ ఈ నెల 17వ తేది ఉదయం 6 గంటల నుండి 18 ఉదయం గంటల వరకు హాస్పిటల్ కి వచ్చే రోగులకు వైద్య సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. కేవలం హాస్పిటల్ లో అంతకు ముందు ఉన్న రోగులకు మాత్రమే సేవలను కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 17 ఉదయం 6గంటలకు మెడికల్ కళాశాల నుండి పాత బస్టాండ్, పీఎస్ఆర్ సెంటర్, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్, నుండి కొత్త బస్టాండ్ వరకు బారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున ప్రజలు, రోగులు సహకరించగలరని కోరారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223