1500 కోట్లతో అభివృద్ధి పథంలో తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే

తిరుమలగిరి 20 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలకేంద్రం లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 5ఎకరాల ఉన్నవారికి రైతులకు రైతు భరోసా పడిందని, తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లతో రైతుభరోసా రైతుల ఖాతాలో జమవుతుందని అన్నారు. రైతు భరోసా అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి, మంత్రివర్గానికి తుంగతుర్తి నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఇప్పటివరకు దాదాపు 1500 కోట్ల తో అభివృద్ధి పథంలో నడుస్తుంది అదేవిధంగా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఫోన్ టాపింగ్, ఈ-కార్ రేస్, కాలేశ్వరం వాటిపై విచారణ జరుగుతుందని కెసిఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దళిత మాదిగ ఎమ్మెల్యేలలో ఒక దళిత మాదిగ ఎమ్మెల్యేను మంత్రిగా చేసుకున్నామని అందుకు తన వంతు పాత్ర పోషించానని, దానికి సహకరించిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..