100రోజులు పని పూర్తి చేయించి ఆత్మీయ భరోసా అందేలా చూడండి

Mar 19, 2025 - 19:51
Mar 19, 2025 - 19:57
 0  24
100రోజులు పని పూర్తి చేయించి ఆత్మీయ భరోసా అందేలా చూడండి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ 100రోజులు పని పూర్తి చేయించి ఆత్మీయ భరోసా అందేలా చూడండి* అదనపు కలెక్టర్ రాంబాబు... ఆత్మకూర్ ఎస్.. 100రోజుల లోపు పనులు చేసిన కూలీలను మార్చి 31లోపు 100రోజులు పనులు పూర్తి చేయించి ఆత్మీయ భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. బుధవారం మండల పరిధిలోని నెమ్మికల్ లో జరగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలని వడదెబ్బ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని అవసరం అయిన చోట పనులు గుర్తించాలన్నారు. అనంతరం స్థానిక పీజీఎఫ్ పాఠశాల లో ఎస్ ఎస్ సి పరీక్షల కోసం చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వీరి వెంట ఎంపీడీవో హసీo,apo ఈశ్వర్ ఈ సి మెంబర్ అరుణ జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ అంజమ్మ తదితరులు ఉన్నారు.