హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో అభిమానుల జోష్
31-08-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలు. జన్మదిన వేడుకల్లో హర్షవర్ధన్ రెడ్డి అభిమానుల జోష్, పక్క వారి గుండెల్లో పరుగులెత్తిస్తున్న గులాబీ దళం చిన్నంబావి చివరస్తాలో వేడుకలను ఘనంగా నిర్వహించిన ఉమ్మడి మండలాల ఇన్చార్జి గోవింద శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకట్ రమణమ్మ చిన్నారెడ్డి. చిన్నంబావి మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి
చిన్నంబావి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 48 పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట ఈ కార్యక్రమం వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం చివరస్తాలో కేక్ కటింగ్ చేసి రక్తదానం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత మాజీ జడ్పిటిసి మాజీ ఎంపీపీ చిన్నంబావి పాత్రికేయులకు సోదరి భావంతో రాఖీలు కట్టి అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలకు హాజరై విజయవంతం చేశారు.