జాతీయ పంచాయతీరాజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి
24-04 -2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ కె వెంకట రెడ్డి అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇట్టి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డికి చెప్పి ఆ సమస్యకు అక్కడనే పరిష్కారం చేసుకుని వెళ్ళటం, మరియు కొన్ని సమస్యలకు కొంత సమయపాలన పాటించడం జరిగినది. ఎక్కువగా గ్రామంలో నెలకొన్న సమస్య ఆశా వర్కర్ల సమస్య గ్రామంలో ఇద్దరు ఆశా వర్కర్లు ఉన్నప్పటికీని రోగులను యశోద భాయ్ సరిగ్గా చూసుకోవట్లేదు ఆమె వద్దు మాకు అని గ్రామసభకు హాజరైనటువంటి గ్రామస్తులు అధిక సంఖ్యలో చెప్పడం వల్ల సర్పంచ్ కూడా స్పందించి త్వరలోనే కొత్త వాళ్ళని తీసుకుందామని చెప్పడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి తో పాటు గ్రామ పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్, వార్డ్ నెంబర్లు మోసమోని శివ, కురువ వెంకటస్వామి, బత్తుల మోహన్, గొందిపర్ల బాలకృష్ణ, ఈశ్వరమ్మ, మామిళ్ళపల్లి శ్రీరాములు మరియు అంగన్వాడీ టీచర్ పార్వతమ్మ, ఆశ వర్కర్ రామచంద్రమ్మ వీరితోపాటు గ్రామ పెద్దలు పెద్ది బాలకృష్ణ, సింగోటం బాలస్వామి, విష్ణు సాగర్, ఎండి మక్బూల్ పాషా, గొందిపర్ల శివయ్య, చిన్న హుస్సేన్, గుంటి నారాయణ, తూముకుంట నరసింహ, మేకల బాలస్వామి
యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.