హమాలీలకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.సీఐటీయూ డిమాండ్

Apr 13, 2025 - 22:35
 0  6
హమాలీలకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.సీఐటీయూ డిమాండ్
హమాలీలకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.సీఐటీయూ డిమాండ్

జోగులాంబ గద్వాల 13 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల అడ్డామీద పనిచేసే హామలీలకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన హమాలీ కార్మికుల జనరల్ బాడి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తు సేవలను సరఫరా చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు అందుబాటులో ఉన్న హమాలిలకు ప్రభుత్వమే ఇన్సురెన్స్ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు పని ప్రదేశాలలో ప్రమాదవశాత్తు జరుగుతున్న నిరంతర సంఘటనల వల్ల కార్మికులు తాము సంపాదించిన ఆదాయాన్ని మొత్తం ఆసుపత్రులకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హమాలీ లకు భవన నిర్మాణ కార్మికుల తరహాలో ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో 90% అసంఘటిత రంగంలో కార్మికులు పనిచేస్తున్నారని వీరి ద్వారానే కేంద్రానికి 95 శాతానికి పైగా ఆదాయం వస్తున్నదని కానీ వీరి  సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రమ్ కార్డు కేవలం గుర్తింపు కార్డులు జారీ చేయడానికి సరిపోయిందని కార్మికులకు దీని వల్ల  ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని విమర్శించారు ఈశ్రమ్ లో నమోదు చేసుకున్న కార్మికులకు మరణించిన ప్రమాదాలు జరిగిన వారి ఖాతాలలో నగదు జమ కావడం లేదని అన్నారు ప్రతి కార్మికుడికి పరిహారాలను  వారి ఖాతాలలో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు వ్యాపారస్తులు సైతం  మానవత దృక్పథంతో వ్యవహరించి ప్రమాదాలు జరిగిన సందర్భంలో కార్మికులను ఆదుకోవాలని కోరారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇన్సూరెన్స్ చట్టం చేసి వారికి ప్రత్యేక అడ్డాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలలో హమాలీలకు మొదటి  ప్రాధాన్యం  ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సీఐటీయూ  జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ హమాలీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగన్న బాలకృష్ణ నాయకులు మజ్జిగ  ఆంజనేయులు వెంకటేష్ నరేష్ కళ్యాణ్ పరశురాం రామకృష్ణ గజేంద్ర  తిరుపతమ్మ నరసింహ తదితరులు పాల్గొన్నారు 
ధన్యవాదాలతో
ఉప్పేర్ నరసింహ
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోగులాంబ గద్వాల జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333