సోసైటీ పేరుతో కాకుండా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేస్తే వెంటనే ఆమోదిస్తాం.
న్యూఢిల్లీ: :-
‘జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. అందులో భాగంగానే ఈ అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ వేశాం. మీకు ఎలాంటి మసస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు చెప్పుకోండి. సబ్ కమిటీని ఒకే చోట కూర్చోబెట్టి ఆ సిఫార్సులను తీసుకువస్తే మీరు టీ తాగే లోపు మినిట్స్ రాసి, కేబినెట్‌లో ఆమోదిస్తాం. . వీటిపై ఎవరైనా పిటిషన్లు వేయాలన్నా సాధ్యం కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇస్తాం కాబట్టి.. ఇళ్ల స్థలాలపై పిటిషన్ వేయాల్సి వస్తే ఒక్కొక్కరి పేరుమీద వేయాలి. అది సాధ్యం కాదు. భవిష్యత్తులో ఆ ఇళ్ల స్థలాలపై సమస్యలు రాకూడదన్నదే మా ప్రయత్నం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.