సోమవారం 17 నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలోనే కాకుండా ఈనెల 17వ తేదీ నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా సంబంధిత మండలాల అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలను సమర్పించవచ్చన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులను సంబంధిత అధికారులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరిస్తారన్నారు. ప్రజలు చిన్న చిన్న సమస్యలకే కలెక్టరేట్ వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆయా మండలాల్లోనే ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల సంబంధిత మండలాధికారులు మండల స్థాయి ప్రజావాణికి సకాలంలో విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.