సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 

Mar 24, 2026 - 20:56
Mar 24, 2026 - 20:56
 0  0
సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 

58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ అతడితో లింకులు

దేవుడు, జ్యోతిష్యం పేరుతో ఓ జ్యోతిష్యుడు దారుణాలకు తెగపడ్డాడు. హైక్లాస్ మహిళలనే లక్ష్యంగా చేసుకుని వారికి జ్యోతిష్యం పేరుతో మాయమాటలు చెప్పి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మరికొంది మహిళలకు మత్తు మదు, డ్రగ్స్ ఇచ్చి తన ఫామ్ హౌస్ కేంద్రంగా అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ మహిళాలంతా ఉన్నతవర్గాలకు చెందిన వారు కావడంతో వారి న్యూస్, సెక్స్ వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు లాగినట్టు పోలీసుల విచారణలో తేలింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనలకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. 

నాసిక్‌లో ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడిగా పేరుపొందిన అశోక్ ఖరత్ తన ఫామ్ హౌస్‌ను నేరాలకు కేంద్రంగా మార్చుకుని, మహిళలకు మత్తు పదార్థాలు ఇచ్చి, వారి బలహీన స్థితిని ఉపయోగించుకుని అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ ఘటనల్లో సుమారు 58 మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంపన్న మహిళలను టార్గెట్ చేసి, వీడియోలు తీసి, వాటితో బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నాడని అధికారులు వెల్లడించారు.

ఈ దారుణాలపై ఒక 35 ఏళ్ల మహిళ ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది. ఆమెను కొన్ని నెలల పాటు బందీగా ఉంచి, శారీరకంగా మరియు మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి.

అశోక్ ఖరత్ రాజకీయంగా బలమైన వ్యక్తి కావడంతో ముందస్తు సమాచారం అందితే సాక్షాలు నాశనం చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు, అత్యంత రహస్యంగా అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించారు. దొంగల మాదిరిగా నటిస్తూ ఫామ్ హౌస్‌లోకి చొరబడి, అతడిని అదుపులోకి తీసుకుని, బెడ్‌రూమ్ సహా అన్ని గదులను తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్స్, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్కులు, మొబైల్ ఫోన్లు, మరియు దాదాపు రూ.200 కోట్లకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వీడియోలను చూసిన పోలీసులే షాక్‌కు గురయ్యారు. అందులో మహిళలకు డ్రగ్స్ ఇవ్వడం, వారిపై లైంగిక దాడులు చేయడం వంటి అమానుష ఘటనలు రికార్డు అయ్యాయి. వెంటనే ఆ కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో మరో సంచలన అంశం ఏమిటంటే, అతడిని గురువుగా భావించి పాదపూజ చేసిన మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకంకర్ కూడా ఈ వివాదంలో చిక్కుకుని రాజీనామా చేయాల్సి వచ్చింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333