సూర్యాపేటలో సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్న టీయూడబ్ల్యూజే - ఐజేయూ

Jun 9, 2026 - 21:26
Jun 9, 2026 - 21:34
 0  57
సూర్యాపేటలో సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్న టీయూడబ్ల్యూజే - ఐజేయూ

జర్నలిస్టులకు అండగా భరోసాగా నిలుస్తున్న టీయూడబ్ల్యూజే ఐజేయు

టియుడబ్ల్యు జె ఐజెయు లో చేరిన సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శిగ సురేష్ గౌడ్

సూర్యాపేట, 9 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగిస్తూ, అర్థ శతాబ్దానికి పైగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషి చేస్తున్న సంఘం టీయూడబ్ల్యూజే - ఐజేయూ అని, సూర్యాపేట జిల్లాలో సభ్యత్వ నమోదులో టీయూడబ్ల్యుజే ఐజేయు దూసుకుపోతుందని టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. టీయూడబ్ల్యూజే-ఐజేయూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వార్త దినపత్రిక జిల్లా బ్యూరో శిగ సురేష్ గౌడ్ కు  సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిజం రంగంలో తనకంటూ ఒక గుర్తింపును పొంది అనేక సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి ప్రజల సమస్యలపై ఎన్నో మంచి కథనాలను అందించిన శిగ సురేష్ గౌడ్ కు యూనియన్ లో తగు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. పాలకులు ఎవరైనా జర్నలిస్టుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడే సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయూ మాత్రమేనని పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా తరగతులను త్వరలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ కృష్ణ బంటు, సాక్షి విజయ్, బత్తుల మల్లికార్జున్, రషీద్, బిగ్ టివి రామకృష్ణ, ఎబిఎన్ మల్లేష్, హెచ్ ఎం టివి నాగరాజు, లింగాల సాయి, కొండ్లె కృష్ణయ్య,99 టివి జహీర్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333