సూక్ష్మ,చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు ర్యాంప్ ద్వారా అవకాశాలు డైట్(DEET)అవగాహన,రిజిస్ట్రేషన్ నమోదు 

Jul 17, 2025 - 19:44
 0  3
సూక్ష్మ,చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు ర్యాంప్ ద్వారా అవకాశాలు డైట్(DEET)అవగాహన,రిజిస్ట్రేషన్ నమోదు 

అడ్డగూడూరు 17 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి తీసుకువచ్చిన ర్యాంపు(రైసింగ్ అక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్)ప్రాజెక్ట్ గురించి అడ్డగూడూరు పంచాయతీ కార్యదర్శులకు మండల అధికారులకు,మండల ఎంపిడిఓ శంకరయ్య అధ్యక్షతన అవగాహన సదస్సును జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరి కుంట్ల రంజిత్ కుమార్ నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్త పరిశ్రమలకు,ఉన్న అవకాశాలను,ప్రభుత్వ పథకాలను,తెలుసుకుని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒకరు మహిళలు నిరుద్యోగులు పారిశ్రామికవేత్తలుగా తయారు అవ్వాలని ఈ సందర్భంగా సూచించారు.అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కొరకు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన డైట్ సెట్ పోర్టల్ గురించి వివరిస్తూ గ్రామాలలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరు డైటులో నమోదు చేసుకొని తద్వారా ఉద్యోగ అవకాశాలను పొందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసి పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి,పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333