సుంకరి కేశయ్య కు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

Sep 21, 2026 - 05:55
 0  2
సుంకరి కేశయ్య కు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

తిరుమలగిరి 21 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ పితృవియోగం చెందారు. ఆయన తండ్రి సుంకరి కేశయ్య శనివారం రోజున బొప్పరం గ్రామంలోని తన నివాసంలో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ , నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం బొప్పరం గ్రామానికి చేరుకుని, కేశయ్య పార్థివదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేశయ్య భౌతికకాయంపై పూలమాలలు ఉంచి, వారు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి జనార్దన్‌ను పరామర్శించి, తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. కేశయ్య వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. ఈ నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ 9 మండలాల అధ్యక్షులు , మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల గ్రామ సర్పంచ్లు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బొప్పరం గ్రామ ప్రజలు, తుంగతుర్తి, నకిరేకల్, నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి