సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మండల అధ్యక్షుడు జోజి

Apr 8, 2025 - 19:41
 0  22
సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మండల అధ్యక్షుడు జోజి

అడ్డగూడూరు08 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన కన్నెబోయిన నర్సయ్య పద్మకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్ ను తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత పేదల పక్షపాతి మందుల సామేల్ ఆదేశాల మేరకు అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ చెక్కును అందజేశారు.అనారోగ్యం బాధపడుతూ హాస్పిటల్ లో ఖర్చులు భరించలేని పేదవారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటూ అందులో భాగంగా మంగళవారం రోజు తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి చెక్కులను అందజేయడం జరిగింది.ఇలా పేదవారి వైద్యానికి సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వంనికి శాసనసభ్యులు మందుల సామేల్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు అని లబ్ధిదారుడు అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనుగోటి జోజి,మోత్కూర్ అని మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగాల నర్సిరెడ్డి,మాజీ ఎంపీటీసీ బొమ్మవోని లక్ష్మయ్య అడ్డగుడురు మండల కాంగ్రెస్ మండల నాయకులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333