సర్-2 వ దశ కార్యక్రమంలో అప్రమత్తంగా ఉండాలి.. ఏ.ఐ.సి.సి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్
పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలి...
రాష్ట్ర నీటిపారుదల శాఖామాత్యులు ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి
సర్-2 కార్యక్రమాన్ని అశ్రద్ధ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పార్టీ అన్ని స్థాయిలలో నాయకులు సమన్వయం తో పని చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర నీటిపారుదల శాఖామాత్యులు అన్నారు..
ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య అధ్యక్షతన జరిగిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రప్రధమ సమావేశంలో ముఖ్య అతిథిలుగా పాల్గొని పార్టీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు..
తెలంగాణా లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళుతూ వివిధ పథకాల ప్రాముఖ్యత, ప్రజలకు జరిగే మేలు గురించి వివరించాలని వారు అన్నారు..
జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై సమీక్షించిన మీనాక్షి నటరాజన్, జిల్లా లోని పార్టీ నాయకులు కార్యకర్తలు మంచి సమన్వయం తో పని చేస్తున్నారని, పార్టీ నాయకులను అభినందిస్తూ,
రాబోయే రోజుల్లో కూడా ఇదే పని తీరును కనపరచాలని చెప్పారు.
PAC సభ్యులు సూచించిన అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది..
సూర్యాపేట నియోజకవర్గం రాజకీయ వ్యవహారాలపై చర్చ జరిగిన సమయంలో, సభ్యులు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం సంబంధించి పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమంలో చురుకుకుగా పాల్గొంటూ, కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి కి పార్టీ సముచిత స్థానం కలిపించాలనే పి.ఏ.సి సభ్యుల సూచన మేరకు స్పందిస్తూ, పార్టీ నాయకులతో కూలంకషంగా చర్చించి త్వరలోనే ఒక సముచిత నిర్ణయం తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ తెలియజేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పి.ఏ.సి సమావేశాన్నుదేశించి మాట్లాడుతూ, దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో తెల్లరేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని, కొత్తగా కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ఇస్తున్నామని చెప్పారు.
రాష్ట్రం లో ఎల్ నినో ప్రభావం తీవ్రం గా ఉండే ప్రమాదం ఉందనీ, అందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు పార్టీ నాయకులు అవగాహన కలిపించాలని, ప్రస్తుతం తెలంగాణ జలాశయాల్లో ఉన్న నీరు రాబోయే ఎండాకాలం వరకు తగినన్ని తాగు నీటిని నిల్వ చేసి, మిగిలిన నీటిని వ్యవసాయ అవసరాలకు విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు..
సీనియర్ కాంగ్రెస్ నాయకులను గౌరవిస్తూ, నామినేటెడ్ పదవులలో వారికి ప్రాధాన్యతనివాలనే పి.ఏ.సి సభ్యుల సూచన పై స్పందించిన మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీలో కష్టపడి చేసే వారికి తప్పనిసరిగా
సముచిత స్థానం కలిపిస్తామని హామీ ఇచ్చారు..
ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర రావు, మునిసిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, జిల్లా సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ ఆలేటి మాణిక్యం, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వీరయ్య, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ లు ఫ్లోర్ లీడర్ లు, తదితరులు పాల్గొన్నారు..