సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి

Jul 23, 2026 - 20:32
Jul 23, 2026 - 20:32
 0  6
సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి

అడ్డగూడూరు 23 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా" గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ (సార్) ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు,బూత్ లెవల్ ఏజెంట్లకు బీఎల్ఏలకు సూచించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన చివరి తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులు,కార్యకర్తలు, బీఎల్ఏలపై ఉందని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి,అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలను సకాలంలో నింపించి సంబంధిత అధికారులకు సమర్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓలకు ప్రభాకర్ రెడ్డి అభినందనలు తెలియజేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.