సరూర్ నగర్  ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఎగరవేసిన వార్డెన్ రఘుమారెడ్డి 

Aug 15, 2026 - 19:52
 0  1
సరూర్ నగర్  ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఎగరవేసిన వార్డెన్ రఘుమారెడ్డి 
సరూర్ నగర్  ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఎగరవేసిన వార్డెన్ రఘుమారెడ్డి 

హైదరాబాద్,16 ఆగస్టు 2026 (ఆదివారం)తెలంగాణ వార్త రిపోర్టర్: ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహం సరూర్ నగర్లో 80వ,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. తదనంతరం వార్డెన్ రఘుమారెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను  స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా విద్యార్థులు, యువత దేశ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలని,దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, విద్యార్థుల ప్రదర్శనలు నిర్వహించి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333