సమాచార హక్కు చట్టంపై అవగాహన

Aug 22, 2025 - 18:36
 0  3
సమాచార హక్కు చట్టంపై అవగాహన

కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పీఐవో, అపిలెట్ అధికారులకు చట్టం పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, శ్రీమతి. వైష్ణవి మేర్ల, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ , ఎస్పీ శ్రీనివాస్ రావులతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని తెలిపారు. ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాల్లో జోగులాంబ గద్వాల జిల్లా ఒకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి, పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. RTI దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా, చట్టంలో ఉన్న సమయపరిమితి లోపల సమాధానమివ్వాలని ఆదేశించారు. గత మూడు సంవత్సరాల నుండి 17వేల ఆర్టిఐ కేసులో పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటనలు చేపట్టడం జరుగుతుందన్నారు.  ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో పర్యటించి కేసులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు.  పారదర్శకమైన పాలన కోసం చట్టం ఉపయోగపడాలని, ప్రజలు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సదుద్దేశంతో వినియోగించుకోవాలన్నారు.  అధికారులు చట్టం పట్ల భయం విడనాడి నిర్భయంగా యాక్ట్ ప్రకారం అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందజేయాలని, చట్టం అమలులో దేశంలో ప్రపంచ స్థాయి 8వ స్థానంలో ఉన్నదని, రాబోయే రోజులలో నెంబర్ వన్ గా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.   ఆర్టిఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. అన్ని శాఖల అధికారులు 4-1బి, సిటిజన్ చార్టర్ ను పక్కాగా అమలు చేస్తే సమస్యలు తగ్గుతాయి అన్నారు. ప్రభుత్వ శాఖలు పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని, జిల్లాస్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులకు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ మాట్లాడుతూ, యాక్ట్ లో 31 సెక్షన్లు ఉన్నాయని, సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు.  చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు మే నెలలో కొత్త కమిషనర్లను నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో గత సంవత్సరం నుండి
 ఆపరిష్కృతంగా ఉన్న ఆర్టీఐ అప్పీల్ కేసులను కలెక్టరేట్లో కమిషన్ ప్రత్యేకంగా పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని అందరూ పీఐవో అధికారులు యాక్ట్ నిబంధనల ప్రకారం సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు దేశాల భూపాల్, శ్రీమతి వైష్ణవి మేర్ల అధికారులకు ఆర్టిఐ యాక్ట్ పై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం స.హ. చట్టంపై సందేహాలను నివృత్తి చేశారు.  అనంతరం కమిషనర్లను శాలువ, మెమొంటోలతో కలెక్టర్, ఎస్పి లు సత్కరించారు.సమావేశ అనంతరం పెండింగ్ లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు. సంబంధిత పీఐవో అధికారులు, దరఖాస్తుదారుల నుండి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డిఓ అలివేలు, 
 వివిధ శాఖల పిఐఓ లు, అప్పీలెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333