సమగ్ర కులగణన ను విజయవంతం చేసుకుందాం...తన్నీరు రాంప్రభు
తుంగతుర్తి నవంబర్ 15తెలంగాణ వార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కులగణనను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని బీసీ కులాల, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో బీసీ సమగ్ర కుల గణన చైతన్య వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఏ పార్టీ కూడా సమగ్ర కులగణన చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కులాలు, బీసీ సంఘాలు ఐక్యతగా నిలబడి కులగణన సాధించుకోవడం కోసం రిజర్వేషన్లను సాధించుకోవడం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన హామీని నెరవేర్చాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి సమగ్ర కులగణన చేయడానికి జీవో నెంబర్ 18 ని తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతున్నది కాబట్టి అన్ని కులాలు సహకరించి మన కులం యొక్క పేరును కచ్చితంగా చెప్పి మనం కులం యొక్క గౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కులగణన జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లోని 136 కులాలు విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, సామాజికపరంగా, రాజకీయపరంగా, అన్ని రంగాలలో అవకాశాలు దొరకడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలు కూడా రాజకీయ ప్రాతినిధ్యం లభించడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి కులానికి కూడా వారి యొక్క జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అనేక రకాల సంక్షేమ పథకాలలో అన్ని కులాలకు కూడా అవకాశాలు కూడా దొరకడం జరుగుతుంది. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు సమగ్ర కులగణనను విజయవంతం చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పెద్ద బోయిన అజయ్, కొండ రాజు, బ్రహ్మం, ముద్దంగుల యాదగిరి, ఎల్సోజు చంటి, కటకం వెంకటేశ్వర్లు, పులుసు వెంకటనారాయణ, పులుసు వెంకన్న, కటకం సూరయ్య, అంబటి రాములు, పెండెం మసూదన్,అక్కినపల్లి రాములు, ఆనగందుల సంజీవ, ఎండి రఫిక్, కొండా రవి, గోపగాని రమేష్, కోరుకొప్పుల నరేష్ తదితరులు పాల్గొన్నారు