సభ్యుల నమ్మకమే సహకార సంఘం బలం
తిరుమలగిరి 01 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తొండ తిరుమలగిరి నందు వార్షిక మహాజన సభ నిర్వహించారు వార్షిక మహాసభ అధ్యక్షులు పాలెపు చంద్రశేఖర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యుల నమ్మకమే మా సంఘం బలం సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.అలాగే మన సంఘం ఇంత బాగా అభివృద్ధి లాభాల బాటలో నడవడానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి మరియు డైరెక్టర్లకు మరియు సెక్రటరీకి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పానుగంటి నరసింహారెడ్డి మరియు డైరెక్టర్లు గుంటకండ్ల అశోక్ రెడ్డ, బైరెడ్డి భాస్కర్ రెడ్డి ,బానోతు కిస్టు, రావుల సత్తయ్య ,లోడే అవిలయ్య, లావుడియా రంజా ,మరియు సభ్యులు ,సిబ్బంది పాల్గొన్నారు.