సన్నబియ్యం పంపిణీ పరిశీలించిన తహసిల్దార్ హరి కిశోర్ శర్మ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : సన్నబియ్యం పంపిణీ పరిశీలించిన తహసిల్దార్ హరి కిశోర్ శర్మ ఆత్మకూరు ఎస్.. ప్రభుత్వం ఏప్రిల్ నుండి రేషన్ షాపుల్లో రేషన్ కార్డు లబ్ధదారులకు అందజేస్తున్న సన్న బియ్యం పంపిణీ నీ మంగళ వారం మండల తహసీల్దార్ హరి కిశోర్ శర్మ పరిశీలించారు. మండలం లోని ఏనుబాముల, నెమ్మికల్, కోటినాయక్ తండా లలో నీ రేషన్ సన్న బియ్యం షాపుల్లో పంపిణీ నీ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ సన్న బియ్యం ను రేషన్ షాపునుండి తీసుకొవాలని వారు ఈ సందర్భంగా కోరారు. వీరి వెంట అర్ ఐ ప్రదీప్ రెడ్డి, సిబ్బంది యాకుబ్ మీరా రేషన్ డీలర్ లు తదితరులు ఉన్నారు. *రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ లో కాంగ్రెస్ ఉత్సాహం* కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధదారులకు ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఇచ్చిన హామీ ప్రకారం మంగళ వారం నుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా గ్రామాల లో రేషన్ షాపుల్లో డీలర్ లు బియ్యం పంపిణీ చేస్తుండగా మా ప్రభుత్వం నిరుపేదల కు సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రేషన్ కార్డు కు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా రేషన్ షాపుల్లో జరిగే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. ఆయా గ్రామాల లో కాంగ్రెస్ నాయకులు బాస్పంగు భాస్కర్ , మార్కెట్ డైరెక్టర్ గోపగాని పెద్ద వెంకన్న, భాస్పంగు లింగయ్య, వెంకన్న రవీందర్ నాయిని రామూర్తి, గూగులోతు పాండు,అయోధ్యరాములు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.