శ్రీశ్రీ గురించి  రేఖామాత్రంగానైనా తెలుసుకోవడం అవసరం

Aug 23, 2025 - 12:23
 0  16

 .అయన వ్యక్తిత్వం, సాహిత్యం,  సామాజిక చింతన  ఆధునిక కవులకు ఎంతో తోడ్పడుతుంది.
*--*----****-------***
--- వడ్డేపల్లి మల్లేశం 90142206412 
----14....06....2025*******
"దాచినది, దా యపడినది,  కనబడకుండా దాగి ఉన్నది,  కనబడినా  చెప్పడానికి ధైర్యం చాలక  కనుమరుగైనది కూడా  సాహిత్యం అనే ప్రక్రియ ద్వారా  ప్రజల దృష్టికి వస్తుంది.  సాహిత్యం అంతటి సామాజిక బాధ్యతను నిర్వహిస్తుంది" అని అంటారు  మానవ హక్కుల నేత  ప్రముఖ ఉద్యమకారుడు సామాజికవేత్త  ప్రొఫెసర్ బాలగోపాల్  గారు .అంతే స్థాయిలో ప్రముఖ విప్లవ కవి  21వ శతాబ్దాన్ని  శాసించిన  తెలుగు కవి  శ్రీరంగం శ్రీనివాసరావు గారు  తన వ్యక్తిత్వం సాహిత్యం  ఆలోచన ఆచరణ  రాబోయే తరాలకు బాధ్యతను అప్పగించిన తీరు  సమాజాన్ని అన్ని కోనాలలో  విశ్లేషించిన విధానం అబ్బురపరిచేదిగా వుంది.  "చికిత్స చేస్తారా  శస్త్ర చికిత్స చేస్తారా" అంటూ  యువతను ప్రేరేపించిన విధానం  నేటి కవులకు సాహితీవేత్తలకు  ఎంతో ప్రేరణ ఇస్తుంది.  బాధ్యతను గుర్తింప చేయడంతో పాటు  మరింత పదునైన విశ్లేషణకు  తోడ్పడుతుంది అనడంలో  సందేహం లేదు.
    హేతువాది, నాస్తికుడు, విప్లవ కవిగా భాసీల్లిన ఆయన   తొలినాల్ల లో చందోబద్ధ కవిత్వాన్ని రాసినా  ఆ తర్వాతి కాలంలో ధిక్కరించిన వాడిగా  అభ్యుదయ రచయితల  సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల  సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా  శ్రీ శ్రీ ప్రసిద్ధి చెందిన విషయం అందరికీ తెలుసు. అనేక రచనలు చేసినప్పటికీ  అతని మహా ప్రస్థానం  అత్యంత ప్రజా ధరణ పొందిన రచనలలో ఒకటిగా పరిగణించబడినది.  విప్లవ కవిగా పేరు ఉన్నప్పటికీ  ఉమ్మడి రాష్ట్రాన్ని  దృష్టిలో ఉంచుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 1969లో  జరిగిన మొదటి ఉద్యమంలో  తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించడంతోపాటు  వావిలాల గోపాలకృష్ణయ్య గారితో కలిసి  ఖమ్మం జిల్లాలో  సమైక్య నినాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరపడం  తెలంగాణ ఉద్యమకారులు ఆయన ప్రదర్శనకు భంగం కలిగించినా   ఆగకుండా తన సమైక్య నినాదాన్ని  వినిపించడం ద్వారా  ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా  పనిచేసినాడు అనే విమర్శను మూటగట్టుకున్న విషయం కూడా  గమనించాలి. పాలకుల దుశ్చర్యల కారణంగా ప్రజలకు జరిగిన  నష్టాన్ని భర్తీ చేసుకునే క్రమంలో రాష్ట్రాలు విడిపోవడం సహజమైనది కానీ సహజమైనటువంటి ఈ డిమాండ్ ను కూడా అంగీకరించడానికి  మనసొప్పని శ్రీశ్రీ  ప్రజా జీవితంలో మాత్రం  మార్పు కోసం మార్గం చూపి   "పదండి పోదాం పదండి పోదాం పోదాం పోదాం పైపైకి" అంటూ మరో ప్రపంచం పిలుస్తుంది అని  కొత్త ప్రపంచానికి మార్గం  సుగమము చేయడాన్ని  మనము గమనించాలి .1928లో 18వ ఏ ట ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించిన ఆయన  ఆ తర్వాత కాలంలో   గ్రాంథిక శైలి చందస్సును పక్కనపెట్టి  అభ్యుదయ బాట పట్టడం జరిగింది 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా 
ప్రచురితమైన తర్వాత  ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థాయిలో నిలవడం వలన శ్రీశ్రీ మహాకవిగా  పేరు తెచ్చుకోవడం జరిగింది.  మహా ప్రస్థానంలోని  కవితలన్నీ కూడా మార్క్సిజం దృక్పథంతో రాసినవే అని పరిశీలకులు గుర్తించినా   అవి రాసే నాటికి మార్కెషిజం  అనేది  ఒకటి ఉందని ఆయనకే తెలియకపోవడం  గమ్మత్తైన విషయం. ఆయన రాసిన  కొన్ని ప్రముఖమైన రచనలు మహాప్రస్థానం, ప్రభవ, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, సిరిసిరిమువ్వ,  మూడు 50లు, చరమ రాత్రి, వారం వారం,  మన గురజాడ  వంటి అనేక రచనలు  వారి కలం నుండి జాలువారినవి.  "సామాన్యుని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే సమకాలిన సామాజిక రాజకీయ సమస్యల గురించి  అప్పటివరకు తెలుగు కవిత్వంలో ఉపయోగించని శైలి మరియు కోణంలో రాసిన మొట్టమొదటి నిజమైన ఆధునిక తెలుగు కవిగా ఆయనకు పేరు ఉన్నది.   బావ కవిత్వానికి  ప్రతినిధి అయినటువంటి కృష్ణశాస్త్రి బాధ  ప్రపంచ బాధ అయితే ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధగా  జనంలో  ఒక వాడుకలో ఉన్న   మాటగా మిగిలిపోయింది. తాడితులు పీడితుల గురించి  రాస్తూ ఆవేదన చెందవద్దని  వారిని ఉద్దేశించి "ఏడవకండి ఏడవకండి జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి  నీ కలలను సాకారం చేసుకోండి కొత్త ప్రపంచాన్ని పాలించండి" అని  ప్రజలకు భరోసా ఇచ్చిన కవి శ్రీశ్రీ .
     ????శ్రీ శ్రీ సాహిత్య శైలి  గురించి ప్రస్తావించినటువంటి అనేకమంది మేధావులు విప్లవ రచయితలు సాహితీవేత్తలు  శ్రీ శ్రీ కవిత్వం రాయడం వరకే  పరిమితం కాలేదని తాను చెప్పిన దానిని ఆచరించి చూపేవాడని  అభిప్రాయబడినారంటే సాహిత్యం యొక్క  కర్తవ్యం కేవలం  రచన వరకే కాదు ఆచరణ అవసరమైతే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం కూడా అవసరమని
శ్రీ శ్రీ ఆచరణ ద్వారా తెలుస్తున్నది. 1950లో వచ్చినటువంటి డబ్బింగ్ సినిమా ఆహుతి ద్వారా ఆయన తెలుగు సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ  శ్రీ శ్రీ అనేక తెలుగు సినిమాలలో పాటలు రాయడంతో పాటు  తెలుగు చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా  పనిచేయడమే కాకుండా భారతదేశంలోని అత్యుత్తమ సినిమా పాటల రచయితలలో ఆయన ఒకరుగా  నిలిచిన విషయం గమనించాలి.  తెలుగులో వెయ్యికి పైగా సౌండ్ ట్రాకులకు  సాహిత్యాన్ని అందించిన  శ్రీశ్రీని తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప ఆస్తిగా పరిగణిస్తారనడం అతిషయోక్తి కాదు. .30 ఏప్రిల్ 1910లో విశాఖపట్నంలో జన్మించిన ఆయన  15 జూన్ 1983న మద్రాస్ లో  మరణించేవరకు  సాహిత్య  ప్రక్రియను కొనసాగిస్తూనే  సాహిత్య అకాడమీ సభ్యునిగా, దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘం  ఉపాధ్యక్షునిగా, మరియు ఆంధ్రప్రదేశ్ విప్లవ రక్షకుల సంఘం అధ్యక్షునిగా  పలు బాధ్యతలు నిర్వహించడంతోపాటు  పౌర హక్కుల సంఘాలలో కూడా  పనిచేసి మానవ హక్కులను  కాపాడాలని  అందుకోసం తన రచనల్లో జీవితాంతం  కృషి చేసినటువంటి అనేక దృష్టాంతాలను  మనం చూడవచ్చు. అందుకే ఆయన విప్లవ రచయితగా 21వ శతాబ్దాన్ని శాసించిన  కవిగా చరిత్రలో ముద్ర వేసుకున్నాడు.  మహా ప్రస్థానం అనే  సంకలనం ద్వారా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ   జాతీయ చలనచిత్ర అవార్డు, నంది అవార్డు, మరియు సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు  ఎన్నో పురస్కారాలను అందుకోవడం  గమనించదగినది.
సాహిత్య రంగంలో స్థిరపడక ముందు  1935 లో వైజాగ్ లోని ఎస్వీఎస్ కళాశాలలో ప్రదర్శన కారుడిగా,  1938లో ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్ గా,  తరువాత ఢిల్లీ ఆకాశవాణి హైదరాబాద్ రాష్ట్రం మరియు ఆంధ్ర వాని దినపత్రికలో వివిధ హోదాల్లో పనిచేశారు.సాహిత్యం ద్వారా ప్రజల మనిషిగా స్థిరపడడం సమాజాన్ని శాశించడం అనే అంశాలు సాహిత్యరంగంలో అరుదైనా విషయాలు.వైవిద్యం ఎంతున్నా  అందుకు ప్రతినిధి కావడం ఆలోచించడంతో పాటు సాహిత్యలోకం ఆచరించతగినది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333