శ్రీధర్ రెడ్డి హత్య పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు

Oct 21, 2024 - 21:41
 0  106
శ్రీధర్ రెడ్డి హత్య పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు

21-10-2024 తెలంగాణవార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల 

 పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన బిజెపి నేత ఎల్లేని సుధాకర్ రావు

 శ్రీధర్ రెడ్డి హత్య ఎందుకు తేల్చడం లేదు?

 చిన్నంబావి మండలం లోని లక్ష్మీ పల్లి గ్రామంలో మే 22వ తారీకు రాత్రి బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి ఇప్పటికీ ఐదు నెలలు దాటి పోతున్న నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు మరియు శ్రీధర్ రెడ్డి తండ్రి బొడ్డు శేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ను ముట్టడించి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.SI పై అధికారులకు సమాచారం అందించారు వనపర్తి డి.ఎస్.పి వెంకటేశ్వరరావు చిన్నంబావి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి విచారణ జరుపుతున్నాము నేరస్తులు దొరకలేదు ఇప్పటివరకు క్లూస్ టీమ్స్ తో వెతుకుతున్నాము త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సమాధానం చెప్పడం జరిగింది. మీరు వనపర్తి ఆఫీసుకు రండి విచారణ ఏమి చేశామో రిపోర్ట్లు చూయిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన సుధాకర్ రావు 20 రోజుల లోపల నిందితులను గుర్తించకపోతే కొల్లాపూర్ తాలూకా ప్రజలందరితో మమేకమై ఎక్కడికక్కడ తాలూకాలోని ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని మీడియా ముఖంగా బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి చెప్పడం జరిగింది.మంత్రి సొంత మండలం లో హత్య జరిగి ఇన్ని రోజులు అవుతున్న నిందితులను గుర్తించక పోవడం పలు అనుమానాలకు తవిస్తుదనీ అన్నారు.శ్రీధర్ రెడ్డి తండ్రి మాట్లాడుతూ హత్య జరిగిన రోజు నుండి మూడు రోజుల వరకు అధికారుల ఫోన్ కాల్ డాటా వెరిఫికేషన్ చేయండి నిందితులెవరో తెలుస్తుంది అధికారులే కావాలని నిందితులను పట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారని శేఖర్ రెడ్డి మండిపడడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి తాలూకా సమన్వయకర్త శేఖర్ గౌడ్,జిల్లా నాయకులు ధారా సింగ్,మండల అధ్యక్షుడుజగ్గాడి శ్రీధర్ రెడ్డి, గూడెం వెంకట్ రెడ్డి, గూడెం మేకల శివ యాదవ్, విధ మండలాల అధ్యక్షులు వీరితోపాటు మండల నాయకులు జింకల కిరణ్ కుమార్,సత్యారెడ్డి,చెన్నయ్య యాదవ్ గోపాల్ నాయుడు,సాయి ప్రణీత్, జానీ బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State