అడ్డగూడూరు బడిముందు భాగం బోర్డు పేరే కానం

Oct 22, 2024 - 13:08
 0  210
అడ్డగూడూరు బడిముందు భాగం బోర్డు పేరే కానం

అడ్డగూడూరు 22 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడ్డగూడూరు పాఠశాలలో ముందు భాగంలో పేరే కనిపించడం లేదు.బదిలీపై వచ్చే ఉపాధ్యాయులె కావచ్చు, బడి ఎక్కడ ఉంది అని వేత్తుకునే పరిస్థితి..ఆ బడి ఆవరణంలో ఎంపీడీవో కార్యాలయం, ఉపాధిహామీ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, ఆధార్ సెంటర్ ఉన్నాయి కానీ అందులో ఉన్న ఆఫీసర్లు కానీ,ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలే,నిత్యం ప్రజా ప్రతినిధులు,అధికారులు అటూనుండే వస్తుంటారు వెళ్తుంటారు.కాని చూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. బడి ప్రారంభమై 5 నెలలు గడుస్తున్న ఎంట్రెన్స్ బోర్డ్ పై పోకసు(శ్రద్ధ)పెట్టిన అధికారే లేరు. బడి పేరుతో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్న చిన్న చిన్న సమస్యల గురించి పట్టించుకున్న అధికారులు లేరు.చెప్పరాశి పిల్లల కా నుండి కలెక్టర్ పిల్లల వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అది తుంగలో తొక్కిన మాదిరిగా ఉంటుంది.ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలే తక్కువ అంటే ఇల్లునుచూడు..ఇల్లాలిని చూడు.. అన్న సామెతగా మిగిలింది.. అక్కడ బడిచుట్టూ అధికారులె?ఇదొక కారణం అక్కడక్కడ వాటర్ లీకేజీ ప్రాబ్లం,బడి ఆవరణంలో చెట్లు చెదారం చుట్టూ పిచ్చి మొక్కలు,చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ప్రభుత్వ పాఠశాలలో తలపిస్తున్నాయి. మండల కేంద్రంలోనే ఇలా ఉంటే గ్రామాల్లో ఎలా ఉండాలి!అలాంటి సమస్యలు లేకుండా చూడాలని ప్రభుత్వాధికారులను గ్రామ స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఎంట్రన్స్ బోర్డును స్థానికంగా పెట్టాలని గ్రామస్తులు కోరారు. ఫ్లెక్సీ బోర్డులు వానకు తడచి ఎండకు ఏండి కొన్ని రోజులకే చీకిపోయి బోర్డు కాన రాకుండా పోతున్నాయి కాబట్టి స్థానికంగా ఉండేటట్టు కలర్ పెయింటర్ తో బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, విద్యార్థిని,విద్యార్థుల, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333