శోభాయమానంగా కొలువుదీరిన కనకదుర్గ
సూర్యాపేట సాంస్కృతికం.. సూర్యాపేట పట్టణ పరిధిలోని శాంతినగర్లో శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయం లో కనకదుర్గ, మైసమ్మ, పరమశివుడు విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ లక్ష్మీనరసింహ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఉప్పల గురునాథం అధ్యక్షతన చివరి రోజు ముగింపు రోజు ఉత్సవాలలో భాగంగా హోమములు, పూర్ణాహుతి, మంత్రస్థాపన, తధ్యారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడవరోజు ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ పి అలేఖ్య మంజుల ముఖ్యఅతిథిగా హాజరై ఏర్పాట్లపై ఆలయ కమిటీని అభినందించారు. సూర్యాపేటలో ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందించడంలో హైందవ పాత్ర ప్రధానమైనదని వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా ఈగ దయాకర్ గుప్తా, పెద్దిరెడ్డి గణేష్, తోట శ్యాం ప్రసాద్, బెలి దే శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు గజ్జల రవీందర్, తల్లాడ వెంకటేశ్వర్లు, గుండా రమేష్, మంచాల అంబరీష, రంగయ్య, నూనె యుగంధర్, కర్నాటి మధు, వీర్లపాటి వెంకటేశ్వర్లు ఏర్పాట్లు పర్యవేక్షించగా, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తరించారు.