శివాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ..

Jan 17, 2025 - 18:59
 0  7
శివాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ..

తుంగతుర్తి జనవరి 17 తెలంగాణ వార్తా ప్రతినిధి :-  తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామ శివాలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. వెలుగుపల్లి గ్రామ శ్రీ భవాని విశ్వేశ్వర స్వామి దేవాలయ కమిటీ, శ్రీ భవాని విశ్వేశ్వర స్వామి సేవా సమితి వ్యవస్థాపక సభ్యుల సమక్షంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు , కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ.... ఈ నూతన క్యాలెండర్ లో వెలుగు పల్లి గ్రామ ముఖద్వారం, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రయాణికుల ప్రాంగణం, వెలుగు పల్లి బొడ్రాయి, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల , సరస్వతి దేవి విగ్రహం, రుద్రమ్మ చెరువు, రుద్రమ్మ గుట్ట, మల్లన్న దేవాలయం లను ఈ క్యాలెండర్ లో ప్రత్యేక ఆకర్షణగా ముద్రించడం జరిగిందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఈ దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ కమిటీ దేవాలయ అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడి సహకరిస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు పాటి రామచంద్ర రడ్డి, కార్యదర్శి గోరంట్ల రాములు, కార్యవర్గ సభ్యులు, శ్రీ భవాని విశ్వేశ్వర స్వామి సేవ సమితి వ్యవస్థాపక సభ్యులు ఈగ దయాకర్, పాటి  రంగారెడ్డి, ఏనుగే మల్లారెడ్డి , పాటి నారాయణరెడ్డి , వాసం అభిలాష్, మల్లె పాక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333