శివస్వాములకి అన్నదాన కార్యక్రమం...

జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం అర్చకులు కిష్టాచార్యులు అధ్వర్యంలో శివ దీక్ష వహించి శివ స్వాములకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు... అంతకుముందు ఆలయంలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేకపూజలు చేసారు...
ఈ కార్యక్రమంలో బోయ మల్లన్న (గురుశివ),దర్శల్లి,ధరూర్ రవి, సీతారాములు,చిన్న కిష్టన్న, బక్రరవి,మెడికల్ రవి,గోపిరెడ్డి, గవ్వల సీతారాములు, ఎరుకలి సవారన్న తదితరులు ఉన్నారు.