శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి

May 23, 2024 - 21:16
May 23, 2024 - 21:17
 0  15
శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి
శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి

మాజి మంత్రి, బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్


శాసనమండలి లో ప్రజా సమస్యల పై కొట్లాడే నాయకులు, ప్రశ్నించే గొంతుక బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల ఉప ఎన్నికలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు, మాజి మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.  గురువారం రాత్రి 
 సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు  నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్ల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఈటెల రాజేందర్  పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి కి మద్దతుగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ధన్యవాదములు తెలిపారు. నేడు  ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ వున్నారని,  34 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రములో ఏ వర్గం కూడ సంతోషంగా లేరని నిరుద్యోగులు  నోటిఫికేషన్ ల కోసం ఎదురుచూస్తున్నారని, ఆరేళ్లుగా నోటిఫికేషన్ లు లేవని  అన్నారు. గత పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. ప్రజలకు ఆరు గ్యారంటీ లు,  420 హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామిలు  నెరవేర్చడానికి సిద్దంగా లేదని   అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న  ప్రశ్నించే గొంతుక కాదని,  ప్రభుత్వానికి భజన చేసే వ్యక్తని అన్నారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం కొట్టాడే పార్టీ బిజెపి మాత్రమే అన్నారు. గతంలో కెసిఆర్ నిరుద్యోగ  భ్ర్రతి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం  రుణమాఫి, తులం బంగారం ఇవ్వడానికి నిధులు లేవని, ప్రతి మహిళకు 2500/- నెలనెల ఇస్తానని చెప్పి ఇవ్వలేదని అన్నారు. ధాన్యానికి బోనస్ 500/-  కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.  యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని స్కామ్ లే జరిగాయని స్కీమ్ లు లేవని అన్నారు. కాని మోడి పాలనలో ఎటువంటి అవినీతి జరగలేదని అన్నారు. 2014 లో 11వ స్థానంలో వున్న దేశ ఆర్దిక వ్యవస్థ నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు . 
జమ్ము కాశ్మీర్ ఒకనాడు రక్తం చిందని రోజు లేదని,  కాని ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత  ఈనాడు కాశ్మీర్ ప్రశాంతంగా వుందని అన్నారు. గత పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో  దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ వేగంగా  జరిగిందని అన్నారు. కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం, గోధుమలు ఇచ్చి పేదలను ఆదుకున్నారని అన్నారు.
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలని  అన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచి ఏనాడూ విద్యార్థుల సమస్యల మీద గాని, నిరుద్యోగుల సమస్యల గురించి గాని శాసనమండలి లో మాట్లాడలేదు. ఫీజు రిఎంబర్స్ మెంట్ నిధులు రాలేదు... పల్లా రాజేశ్వర రెడ్డి స్వార్థం వలన ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు.  ప్రభుత్వ విధానాల మూలంగా ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడే పరిస్థితి ఏర్పడింది.  తీన్మార్ మల్లన్న కు ప్యాకేజీ ఇస్తేనే మాట్లాడుతాడు. అతనికి స్వార్దం తప్ప ప్రజా సేవ చేయాలనే ఆలోచన లేదు . నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డికి గ్రాడ్యుయేట్ లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో  మాజి ఎమ్మెల్యే నేతి సుభాష్ రెడ్డి, కెఎస్ రత్నం,  మాజి మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్‌ కర్నాటి కిషన్, జనార్దన్ రెడ్డి, 
కడియం రామ చంద్రయ్య, మన్మధ రెడ్డి, శ్రీలత రెడ్డి, ఎంఆర్ పిఎస్ నాయకులు యాతాకుల రాజయ్య, రుక్మారావు, చల్లమల్ల నర్సింహ్మ,  సలిగంటి వీరేంద్ర, రంజిత్, పద్మారెడ్డి, కరుణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333