శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వయం పరిపాలన దినోత్సవం.
జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి ఈ రోజు శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు హెడ్మాస్టర్ శామ్యూల్ ఆధ్వర్యంలో స్వయం పరిపాలనా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యంఈవో నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భముగా విద్యార్థులే ఉపాద్యాయులుగా తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అలాగే వివిధ అధికారులుగా విద్యార్థులు వేశాధారణతో అందరినీ అలరింపజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు జిల్లా కలెక్టర్ గా ప్రసన్న, D.E.O గా శివ ప్రసాద్, MEO గా చరణ్ తేజ, హెడ్మాస్టర్ గా ఝాన్సీ మరియు ఉపాధ్యాయిని & ఉపాధ్యాయులు గా మరి కొందరు విద్యార్ధులు పాల్గొని స్వయం పరిపాలన దినోత్సవం చక్కగా నిర్వహించడం జరిగినది. చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు యంఈవో బహుమతులు ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగషేశన్, సురేష్, అజయకుమారి, జావీద్, దావీదు, జనార్ధన్, చెన్నారెడ్డి, శేషమ్మ, కల్యాణి, నాగజ్యోతి, రూపాభాయ్, శ్రావణి, CRP నాగేష్, సరిత పాల్గోన్నారు.