శాంతినగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే
తిరుమలగిరి 15 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్న.శాంతినగర్ గ్రామ నూతన సర్పంచ్ షహినయాకుబ్ వలి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతినగర్ గ్రామానికి అన్ని విధాలుగా నిధులను, ఊరు అభివృద్ధిని చేస్తానని అన్నారు..వారి వెంట మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ సైదులు షేక్ జాన్,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కమల్ , మహబూ ,హుస్సేన్,తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు అక్బర్ పాషా, తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ షేక్ అక్బర్ , యూత్ కాంగ్రెస్ నాయకులు భాష,నశీర్, నాగారం మండల యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అక్బర్ గ్రామస్ధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు...