విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం తో పూరీలు దగ్ధం
తెలంగాణ వార్త ఆత్మకుర్ యస్:- విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం తో పూరీలు దగ్ధం ధాన్యం అమ్మిన 3.80లక్షలు బూడిద పాలు అయ్యాయి.. సుమారు ఆరు లక్షల ఆస్తి నష్టం... ఆత్మకూరు ఎస్... విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం లో ఇల్లు దగ్ధం అయి భారీ నగదు కాలి బూడిద ఐన సంఘటన మండల పరిధిలోని కాశీ గూడెం లో శివారు తేట్టేకుంట తండా లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన బాదావత్ రాoకోటి పూరీ ఇల్లు దగ్ధమైంది. విద్యుత్ మెయిన్ వైరు నుండి వచ్చే సర్వీస్ వైరు తేలిందని అందువలన షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. మంటలు ఆర్కెందుకు ఫైర్ సిబ్బంది సమయానికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల వారు మంటలు ఆర్పారు.ఈ అగ్ని ప్రమాదం లో వరి ధాన్యం అమ్మిన నగదు 3లక్షల, 80వేల రూపాయలు నగదు ఇంట్లో సామాగ్రి భూమి పట్టా పాస్ బుక్ బ్యాంక్ ఎకౌంట్ రాoకోటి కుమారులు ప్రవీణ్ నవీన్ దివ్యల సర్టిఫికెట్లు మొత్తం పూర్తిగా దగ్ధమైనాయి. ఈ ప్రమాదంలో సుమారు ఆరు లక్షల వరకు నష్టం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.