విద్యార్థుల సృజనాత్మక వెలికితీయాలి - డిఎస్పీ రవి

Apr 13, 2024 - 18:35
 0  27
విద్యార్థుల సృజనాత్మక వెలికితీయాలి - డిఎస్పీ రవి

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని డిఎస్పీ రవి అన్నారు. సూర్యాపేట శ్రీ చైతన్య పాఠశాలలో గత నెలలో నిర్వహించిన  ఏ.ఎన్. టి.ఎస్.ఓ ఫైనల్ లెవెల్ పరీక్షలలో సూర్యాపేట శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన 500మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 156మంది స్వర్ణ పతకాలను, 285మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్ లను సాధించారు. ఈ సందర్భంగా డిఎస్పీ కార్యాలయంలో ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.  అనంతరం ఆయన  మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక రంగంలో అభిరుచి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహిస్తే అత్యుత్తమంగా రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో డిజిఎం సుధాకర్, కో ఆర్డినేటర్ నాగేందర్, ప్రిన్సిపాల్ సతీష్, స్కూల్ డీన్ ప్రవీణ్, ఐపీఎల్ ఇంచార్జ్  కె.ఎన్. ఆర్, బ్యాచ్ ఇంచార్జ్ మంగి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333