విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు
గరిడేపల్లి, 9 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరి కాదని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు మంగళవారం నాడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి తహసిల్దార్ కార్యాలయం లో పెండింగులో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చిన పిమ్మట ఆయన మాట్లాడుతూ.... పత్రికా విలేకరుల ముందు,, వేదికల మీద,, టీవీ ఛానల్ లో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ బిఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నాయని తమ పరిపాలనే బ్రహ్మాండంగా ఉందని తమకు తామే కితాబు ఇచ్చుకుంటున్నారని కానీ వాస్తవాలు పరిశీలిస్తే రెండు ప్రభుత్వాల పనితీరులో పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదని నిరుద్యోగ భృతి విషయంలోనూ వితంతువులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ విషయంలోనూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనూ ఇంకా అనేక విధాలుగా పరిశీలన చేస్తే రెండు ప్రభుత్వాలు పని విధానం ఒకే విధంగా ఉన్నదని ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి వారికి హామీ ఇచ్చి ఉన్నారని కానీ అట్టి హామీ అమలు కాకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే కాలేజీ యాజమాన్యాలు తీవ్రమైన వేదనకు గురుగుతున్నారని వారి బాధలను గుర్తించి తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహజంగానే మంచి మాటకారి అని తన వాగ్దాటితో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారని ఇలా ఎంత కాలం చేస్తారని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో వారిని నానాయాతన పెడుతున్నారని ఇందిక సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏవో ఒకటి రెండు మినహా మిగతా ఏవి అమలు కాలేదనే విమర్శ మరియు వ్యతిరేకత క్షేత్రస్థాయిలో ఉన్నదని మంత్రులందరూ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రిగా ఊహల్లో ఉన్నారని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే యోచనలో బిజీగా ఉన్నట్లున్న దని,,, కానీ ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్విని చేయకుండా సక్రమ పద్ధతిలో పరిపాలన చేస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని ఆయన హితవు పలికారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మండల సిపిఐ కార్యదర్శి కడియాల అప్పయ్య బీసీ హక్కుల సాధన సమితి నాయకులు తాళ్ల తిరుపతయ్య ఎస్కే మస్తాన్ నరసయ్య శ్రీకాంత్ ఏఐవైఎఫ్ నాయకులు పరికె భరత్ ఉన్నారు